For Money

Business News

కోలుకున్నా… నష్టాలు తప్పలేదు.

ప్రతిరోజూ భారీగా క్షీణించడం… మళ్ళీ కోలుకోవడం. రోజుకు కొన్ని పాయింట్లు పడుతూ క్రమంగా నిఫ్టి క్షీణిస్తోంది. డే ట్రేడర్లకు నిఫ్టి కనకవర్షం కురిపిస్తోంది. మార్కెట్‌లో తీవ్ర హెచ్చుతగ్గులు కేవలం వీరి కోసమే అన్నట్లు రోజూ స్వల్ప నష్టంతో నిఫ్టి ముగుస్తుంది. నిఫ్టి ఇవాళ అత్యంత కీలక స్థాయిని టచ్‌ చేసి.. షార్ట్‌ ట్రేడర్స్‌కు గోల్డన్‌ ఛాన్స్‌ ఇచ్చింది. ఉదయం చాలా మంది అనలిస్టలు 16250 స్టాప్‌లాస్‌తో అమ్మమని సలహా ఇచ్చారు. ఈ సలహా పాటించినవారు భారీగా లాభపడ్డారు. ఇక దిగువ స్థాయిలో కొన్నవారికీ నిఫ్టి నిరుత్సాహపర్చలేదు. ఓపెనింగ్‌లో 19318ని తాకిన నిఫ్టి మిడ్‌ సెషన్‌లో 15992ని తాకింది. దాదాపు 320 పాయింట్ల నష్టమన్నమాట. దిగువ స్థాయి నుంచి కోలుకుని 16167 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 73 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్‌ కూడా 456 పాయింట్ల నష్టంతో 54088 వద్ద ముగిసింది. నిఫ్టికి ఇవాళ బ్యాంక్‌ నిఫ్టి నుంచి గట్టి మద్దతు లభించింది. ఇవాళ ఒక్క నిఫ్టి బ్యాంక్‌ మాత్రమే 0.61 శాతం లాభంతో ముగిసింది. ఇక నిఫ్టి నెక్ట్స్‌ దాదాపు క్రితం స్థాయిలో ముగిసింది. ఇక నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీ 0.66 శాతం నష్టంతో ముగిసింది. బ్యాంక్‌ షేర్లలో యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ టాప్‌ గెయినర్‌గా నిలిచాయి. ఇక నిఫ్టిలో ఓఎన్‌జీసీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఇక నష్టాల్లో ముగిసిన నిఫ్టి టాప్‌ గెయినర్స్‌లో శ్రీ సిమెంట్, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ ఉన్నాయి.