15900ని దాటిన నిఫ్టి
సింగపూర్ నిఫ్టికన్నా అధిక లాభాలతో నిఫ్టి ప్రారంభమైంది. నిఫ్టి ఓపెనింగ్‌లోనే 15930ని తాకింది. ఇపుడు 15921 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 86 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టిలో 45 షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. అన్ని ప్రధాన సూచీలు అరశాతం లాభంతో ట్రేడవుతున్నాయి. నిఫ్టికి ప్రస్తుత స్థాయిలో తొలి నిరోధం ఉంది. మరి దీన్ని దాటి 16000ని క్రాస్ చేస్తుందా అన్నది చూడాలి. ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుదర్శన్ సుఖాని నిఫ్టి గురించి మాట్లాడుతూ… 15900 స్థాయిపైన నిఫ్టి నిలదొక్కుకుంటే … ఇన్వెస్టర్లు తమ పుట్ పొజిషన్స్ నుంచి బయటికి వచ్చేయమని సలహా ఇచ్చారు. ఇక షేర్ల విషయానికొస్తే టాటా మోటార్స్ ఏజీఎంలో కంపెనీ ఛైర్మన్ వ్యాఖ్యలతో ఈ షేర్ ఇవాళ రెండు శాతం లాభంతో ఉంది. ఐటీ షేర్లకు మద్దతు లభిస్తోంది. ఏషియన్ పెయింట్స్, దివీస్ ల్యాబ్ షేర్లు నష్టాలతో ఉన్నాయి. అయితే నష్టాలన్నీ నామమాత్రమే.