17900పైన నిఫ్టి
అంతర్జాతీయ మార్కెట్లు డల్‌గా ఉన్నా మన మార్కెట్లు దుమ్ము రేపుతున్నాయి. ఉదయం ఆసియా మార్కెట్లు ఒక శాతం వరకు లాభంతో ముగిశాయి. మిడ్ సెషన్‌లో యూరో మార్కెట్లు కూడా గ్రీన్‌లో ప్రారంభమైనా.. కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే నష్టాలు పరిమితంగా ఉన్నాయి. అమెరికా ఫ్యూచర్స్ కూడా నష్టాల్లో ఉన్నా… నామమాత్రపు నష్టాలే అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు మాత్రం జోష్‌పై ఉన్నాయి. నిఫ్టి 17900 స్థాయిని దాటి 17919ని తాకింది. ఇపుడు 246 పాయింట్ల లాభంతో 17869 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 60000 స్థాయిని దాటింది. ఇతర ప్రధాన సూచీలన్నీ ఒకటిన్నర శాతం లాభంతో ఉన్నాయి. చాలా రోజుల తరవాత అపోలో హాస్పిటల్స్ ఆరు శాతం లాభంతో నిఫ్టిలో టాప్ గెయినర్‌గా నిలిచింది. నిఫ్టిలో 47 షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. ఫార్మా, ఆటో, బ్యాంకింగ్ వంటి కీలక రంగాల షేర్ల ధరలు పరుగులు పెడుతున్నాయి.