For Money

Business News

దుమ్ము రేపుతున్న ఫుట్‌వేర్‌ షేర్లు

పండుగల సీజన్‌ దగ్గర పడటం, మార్కెట్‌ సెంటిమెంట్‌ పాజిటివ్‌గా ఉండటంతో ఫుట్‌ వేర్‌ రంగానికి చెందిన అనేక షేర్లు గత కొన్ని రోజులుగా భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా మెట్రో బ్రాండ్స్‌ షేర్‌ అనూహ్య లాభాలతో దూసుకుపోతోంది. ఇవాళ ఈ షేర్‌ ఏకంగా పది శాతం లాభంతో రూ. 899ని తాకింది. ఇపుడు రూ.886 వద్ద ట్రేడవుతోంది. ఇక బాటా షేర్‌ కూడా రూ. 30 లాభంతో రూ. 1880 వద్ద ట్రేడవుతోంది. ఇటీవల లిస్టయిన క్యాంపస్‌ యాక్టివ్‌ వేర్‌ షేర్‌ కూడా గత కొన్ని సెషన్స్‌లో బాగా లాభపడింది. ఇవాళ రూ.8.15 లాభంతో రూ. 586 వద్ద ట్రేడవుతోంది. ఇక రిలాక్సో షేర్‌ దాదాపు రెండు శాతం లాభంతో రూ. 1088 వద్ద ట్రేడవుతోంది. గత నెలలో హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌, నిన్న మోతీలాల్‌ ఓస్వాల్‌ బ్రోకింగ్‌ సంస్థలు మెట్రో బ్రాండ్స్‌ను ఈ ధర వద్ద కూడా రెకమెండ్‌ చేశారు. దీంతో ఈ కౌంటర్‌లో ఆసక్తి బాగా కనబడుతోంది.