17300 దాటిన నిఫ్టి
ఓపెనింగ్‌లోనే నిఫ్టి 200 పాయింట్లకు పైగా పెరిగింది. ఉదయం 17270 పాయింట్లకు చేరిన నిఫ్టి… వెంటనే 17206కి పడినా… కొన్ని నిమిషాల్లోనే 17322 పాయింట్లను తాకింది. ప్రస్తుతం 205 పాయింట్లలాభంతో 17316 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఎయిర్‌టెల్‌లో గూగుల్ పెట్టుబడి పెడుతున్న వార్త వచ్చిన వెంటనే కంపెనీ షేర్ 5 శాతం పెరిగింది. కాని ధర రూ.734 అని తెలియగానే ఒక్కసారిగా లాభాలన్నీ కోల్పోయింది. ఇవాళ నిఫ్టిలో 49 షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. కేవలం మారుతీ మాత్రమే నష్టాల్లో ఉంది. ఇక మిడ్ క్యాప్ నిఫ్టి 1.7 శాతం లాభంతో ట్రేడవుతోంది. మిడ్ క్యాప్ నిఫ్టి షేర్లు భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. కో ఫోర్జ్ ఏకంగా 11 శాతం పైగా లాభంతో ఉంది. అలాగే రూట్ మొబైల్స్ కూడా. నిన్న భారీ లాభాల్లో ఉన్న టీవీఎస్ మోటార్స్ ఇవాళ కూడా ఆకర్షణీయ లాభాలతో రూ.640కి చేరింది. కాని కొన్ని నిమిషాల్లోనే ఈ కౌంటర్‌లో వచ్చిన అమ్మకాల ఒత్తిడికి ప్రస్తుతం ఆరు శాతం నష్టంతో రూ. 591 వద్ద ట్రేడవుతోంది.