NIFTY TRADE:16060పైన నిలబడితేనే
భారీ ఓవర్ సోల్డ్ జోన్ నుంచి నిఫ్టి స్వల్పంగా బయటపడిందని… 16266 దాటితేగాని షార్ట్ కవరింగ్ వచ్చే అవకాశాలు లేవని డేటా అనలిస్ట్ వీరేందర్ కుమార్ అంటున్నారు. నిఫ్టి 16060పైన నిలబడితే కాల్స్ కొనుగోలు చేయొచ్చని.. కాని షార్ట్ కవరింగ్ గ్యారంటీ మాత్రం లేదన్నారు. నిఫ్టికి ఇప్పటికీ అధిక స్థాయిలో అమ్మకాల ఒత్తిడి ఉందని అన్నారు. విదేశీ ఇన్వెస్టర్ల భారీ అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు. కాబట్టి ఇన్వెస్టర్లు లెవల్స్‌ను బట్టి ట్రేడ్ చేయాలని అన్నారు. ఇవాళ్టికి వీరేందర్ ఇస్తున్న లెవల్స్… పెరిగితే 16060. 16134 వద్ద ప్రతిఘటన వచ్చే అవకాశముంది. ఈ స్థాయిలను దాటితే 16189 లేదా 16266 వద్ద తదుపరి ఒత్తిడి ఉంటుంది. 16266 దాటితే మాత్రం షార్ట్ కవరింగ్ వచ్చి నిఫ్టి పరుగులు తీస్తుందని అన్నారు. రేపు వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్‌ను మర్చిపోవద్దని అన్నారు. రేపు ఎన్నికల కౌంటింగ్ కూడాఉంది. సెంటిమెంట్ కీలక పాత్ర పోషించవచ్చు. ఇవాళ నిఫ్టి దిగువకు వెళితే 15910 వద్ద లేదా 15812 వద్ద మద్దతు అందే అవకాశముంది. లేకుంటే తదుపరి మద్దతు స్థాయిలు.. 15754, 15,674. బ్యాంక్ నిఫ్టి వివరాలతో పాటు ఇతర లెవల్స్ కోసం దిగువ వీడియో చూడండి.
https://www.youtube.com/watch?v=FFf7RUq-aKo