కనిష్ఠ స్థాయి వద్ద ముగిసిన నిఫ్టి
ఇవాళ ఉదయం నుంచి నిఫ్టి నష్టాల్లోనే కొనసాగింది. మిడ్ సెషన్‌కు ముందు దిగువ స్థాయి నుంచి కోలుకున్నా… యూరో మార్కెట్ల ఓపెన్‌తో మళ్ళీ క్షీణించింది. యూరో మార్కెట్లు రెండు శాతంపైగా నష్టపోవడం, అమెరికా ఫ్యూచర్స్ ఒకటి నుంచి ఒకటిన్నర శాతం క్షీణించడంతో మన మార్కెట్లలో ఒత్తిడి అధికంగా ఉంది. ఆర్థిక మాంద్యం తప్పదని వస్తున్నవార్తలతో క్రూడ్ ధరలు భారీగా క్షీణించాయి. దాదాపు అయిదు శాతం తగ్గినా.. మన మార్కెట్లో ఎక్కడా రిలీఫ్రాలేదు. ఇవాళ్టి కనిష్ఠ స్థాయి 15385 కాగా, 15413 వద్ద నిఫ్టి ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 225 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టిలో అయిదు షేర్లు లాభాల్లో ఉండగా 45 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. దాదాపు అన్ని సూచీలు ఒకటి నుంచి ఒకటిన్నర శాతం వరకు క్షీణించాయి.