For Money

Business News

నష్టాలున్నా.. కీలక స్థాయిపైన నిఫ్టి ముగింపు

ఇవాళ మార్కెట్‌ను డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ శాసించింది. 17600-17700 మధ్య ఈనెల డెరివేటివ్స్‌ క్లోజ్‌ అవుతుందన్న అంచనాలు నిజమయ్యాయి. ఒకదశలో నిఫ్టి 17,742ని తాకినా మిడ్‌ సెషన్‌ తరవాత పూర్తిగా బలహీనపడిపోయింది. ఒకదశలో 17,585కి చేరినా కోలుకుని 17,618 వద్ద ముగిసింది. నిఫ్టి 50 రోజుల చలన సగటు 17550. నిన్న కూడా నిఫ్టి ఈ స్థాయి దాకా వెళ్ళి… తిరిగి భారీగా కోలుకుంది. వచ్చేవారం నిఫ్టి బలహీనంగా ఉంటుందనే టెక్నికల్‌ అనలిస్టులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ‘17,550’ దిగువకు మార్కెట్‌ పడే అవకాశాలు ఉన్నాయి. ఉదయం నష్టాల్లోకి జారుకున్నా మిడ్‌ సెషన్‌కల్లా గ్రీన్‌లోకి వచ్చింది నిఫ్టి.యూరో మార్కెట్లు కూడా గ్రీన్‌లో ఉండటం, అమెరికా ఫ్యూచర్స్‌ కూడా లాభాల్లో ఉన్నా నిఫ్టి బలహీనంగా ముగిసింది. బ్యాంక్‌ నిఫ్టి ఇవాళ 0.84 శాతం నష్టపోయింది. మిడ్‌ క్యాప్‌ కూడా దాదాపు క్రితం ముగింపు వద్దే ముగిసింది.