చివరి నిమిషంలో లాభాల్లోకి…
ఒకదశలో భారీ నష్టాల్లోకి జారుకున్న నిఫ్టి… తరవాత కోలుకున్నా… పై స్థాయిలో నిలబడలేకపోయింది. మిడ్ సెషన్‌కు ముందు నిఫ్టి 18537 పాయింట్ల కనిష్ఠ స్థాయికి క్షీణించింది. అక్కడి నుంచి కోలుకుని మిడ్ సెషన్లో గ్రీన్‌లోకి వచ్చినా… పై స్థాయిలో నిలబడలేకపోయింది. దీంతో చాలా సేపు నష్టాల్లో కొనసాగి చివర్లో లాభాల్లో ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 13 పాయింట్ల లాభంతో ముగిసింది. చాలా వరకు అదానీ షేర్లు ఇవాళ కోలుకున్నాయి. ముఖ్యంగా నిఫ్టి నెక్ట్స్ ఒక శాతంపైగా లాభాల్లో క్లోజ్ కావడానికి ప్రధాన కారణంగా అదానీ షేర్లే. అదానీ ఎంటర్‌ప్రైజస్ ఎఫ్‌పీఓ పూర్తిగా సబ్స్క్రయిబ్ కానున్న వార్తలు రావడంతో చాలా మంది షార్ట్ చేసినవారు తమ పొజిషన్స్‌ను కవర్ చేసుకున్నారు. అదానీ ఎంటర్‌ప్రైజస్ షేర్ గ్రీన్‌లో ముగిసినా… ఎఫ్‌పీఓ ధరకు దిగువనే క్లోజ్ కావడం విశేషం. నిఫ్టి నెక్ట్స్‌లో అదానీ గ్రీన్, అదానీ ట్రాన్స్పోర్ట్, గుజరాత్ అంబుజా సిమెంట్ గ్రీన్‌లో ముగిశాయి. అయితే అదానీ టోటల్ ఇవాళ కూడా పది శాతం నష్టంతో ముగిసింది.