స్థిరంగా ముగిసిన నిఫ్టి

మిడ్ క్యాప్స్ భారీగా నష్టపోయినా… ఫ్రంట్‌లైన్ షేర్లు రాణించడంతో నిఫ్టి స్థిరంగా ముగిసింది. ఉదయం ఆకర్షణీయ లాభాలు పొందినా… పది గంటల తరవాత లాభాల స్వీకరణ మొదలైంది. 24,589 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన నిఫ్ట తరవాత నష్టాల్లోకి జారుకుంది. 24238 వద్ద మద్దతు లభించింది. అక్కడి నుంచి కోలుకున్న నిఫ్టి 24346 వద్ద ముగింది. క్రితం ముగింపుతో పోలిస్తే 12 పాయింట్లు లాభపడింది. ఇవాళ 2938 షేర్లు ట్రేడవగా 1651 షేర్లు నష్టాల్లో ముగిశాయి. మంచి ఫలితాలు ప్రకటించిన అదానీ పోర్ట్స్ నాలుగు శాతంపైగా లాభంతో ముగిసింది. ఈ షేర్ నిఫ్టి టాప్ గెయినర్స్‌లో అగ్రభాగాన నిలిచింది. తరువాతి స్థానాల్లో బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్‌బీఐ, హిందాల్కో ఉన్నాయి. ఇక నష్టాల్లో ముగిసిన నిఫ్టి షేర్లలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ఉంది. భూషణ్ స్టీల్ టేకోవర్ బిడ్‌ను సుప్రీం కోర్టు కొట్టివేయడంతో ఈ షేర్ ఆరు శాతంపైగా నష్టపోయింది. తరవాతి స్థానాల్ఓ బజాజ్ ఆటో, ఐషర్ మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, హీరో మోటొకార్ప్ ఉన్నాయి.