నష్టాలు పూడ్చుకున్న నిఫ్టి
నిఫ్టి ఇవాళ దిగువ స్థాయి నుంచి భారీగా లాభపడింది. ఉదయం ఆరంభంలోనే 19257 పాయింట్లను తాకని నిఫ్టి తరవాత క్రమంగా కోలుకుంది. మిడ్ సెషన్ తరవాత గ్రీన్‌లోకి వచ్చింది. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో నిఫ్టి ఇవాళ్టి గరిష్ఠ స్థాయి 19465 పాయింట్లను తాకింది. నిఫ్టి రికవరీకి ప్రధాన కారణం దిగువ స్థాయిలో షార్ట్ కవరింగ్ రావడమే. ఆ తరవాత 15 నిమిషాల్లో లాభాల స్వీకరణ కారణంగా నిఫ్టి స్వల్పంగా తగ్గినా.. చివరి నిమిషంలో అనూహ్యంగా మద్దతు రావడంతో గ్రీన్ ఆరు పాయింట్ల లాభంతో ముగిసింది. బ్యాంక్ నుంచి కూడా భారీ నష్టాలను పూడ్చుకుని గ్రీన్‌లోకి వచ్చింది. కాని చివర్లో స్వల్ప నష్టాలతో ముగిసింది. నిఫ్టి నెక్ట్స్ 1.25 శాతం నష్టంతో ముగిసింది. ఈ సూచీలో నిఫ్టి, ముతూట్ ఫైనాన్స్, జిందాల్ స్టీల్, ఏబీబీ, నౌకరీ షేర్లు భారీ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టిలో అదానీ ఎంటర్‌ప్రైజస్ 3.64 శాతం నష్టంతో ముగిసింది. అదానీ షేర్లు నష్టపోయినా… చివర్లో కోలుకున్నాయి. నిఫ్టి 19400పైన క్లోజ్ కాగా, బ్యాంక్ నిఫ్టటి 44000 స్థాయిని నిలుపుకుంది.