For Money

Business News

స్థిరంగా సూచీలు.. నష్టాల్లో షేర్లు

ఇవాళ మార్కెట్‌లో పెద్ద మార్పు లేదు. ఉదయం 18399 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన నిఫ్టి క్లోజింగ్‌కు ముందు 18311ని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే 20 పాయింట్ల నష్టంతో నిఫ్టి 18329 వద్ద ముగిసింది. మెటల్స్‌, సిమెంట్, మిడ్‌ క్యాప్‌ ఐటీ షేర్లు ఒక మోస్తరు లాభాలు పొందగా.. ఇతర రంగాల్లో షేర్లలో గట్టి ఒత్తిడి వచ్చింది. అధిక స్థాయిల్లో చాలా షేర్లలో లాభాల స్వీకరణ కన్పించింది. యూరో మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నా… అమెరికా ఫ్యూచర్స్‌ నష్టాల్లో ఉన్నందున.. నిఫ్టి బలహీనంగా ముగిసిందని కొందరు అనలిస్టులు అంటున్నారు. నిఫ్టి నెక్ట్స్‌ అర శాతం లాభంతో ముగిసింది. నౌకరి డాట్‌ కామ్‌, ఎల్‌ఐసీ, అంబుజా షేర్లు భారీ లాభాలతో ముగియడమే దీనికి ప్రధాన కారణం. మిగతా సూచీలు కూడా రెడ్‌లో ఉన్నా నష్టాలు నామ మాత్రమే. ఇవాళ మీడియా షేర్లలో కూడా ఒత్తిడి వచ్చింది. సూచీలపరంగా చూస్తే బ్యాంక్‌ నిఫ్టి ఇన్వెస్టర్లకు మంచి లాభాలు ఇచ్చింది. భారీగా క్షీణించడమే గాక… సూపర్‌ రికవరీతో ఇంట్రా డే ఇన్వెస్టర్లకు మంచి లాభాలు దక్కాయి.