ఇవాళ ఎందుకు పడింది?

మార్కెట్ ఇవాళ కూడా ఒక మోస్తరు నష్టాలతో ముగిసింది. రేపు వీక్లీ, మంత్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ ముందు మార్కెట్‌లో తీవ్ర స్థాయిలో హెచ్చుతగ్గులు కన్పించాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన నిఫ్టి కొన్ని నిమిషాల్లోనే నష్టాల్లోకి జారుకుంది. సెషన్ కొనసాగే కొద్దీ నష్టాలు పెరిగాయి. మిడ్ సెషన్ సమయంలో నిఫ్టి దాదాపు నష్టాలన్నీ పూడ్చుకుని గ్రీన్‌లోకి వస్తున్న సమయంలో మళ్ళీ పతనం మొదలైంది. అయితే ఈసారి పతనం చాలా తీవ్రంగా ఉండటంతో నిఫ్టి 24,737 పాయింట్ల కనిష్ఠస్థాయికి క్షీణించింది. ఇవాళ్టి గరిష్ఠ స్థాయితోపోలిస్తే 150 పాయింట్లకు పైగా క్షీణించింది. 74 పాయింట్ల నష్టంతో నిఫ్టి 24752 పాయింట్ల వద్ద ముగిసింది. మార్కెట్‌కు విదేశీ ఇన్వెస్టర్లు దూరంగా ఉన్నారు. కొనుగోలు చేస్తే నామమాత్రంగా చేస్తున్నారు. అయితే అమ్మకాలు మాత్రం భారీగా ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా వీరి మద్దతు అందంత మాత్రమే. ఇవాళ కూడా ప్రధాన ప్రైవేట్ బ్యాంకుల్లో అమ్మకాలు జోరుగా ఉన్నాయి. ఒక్క ఎల్‌ఐసీ మాత్రం ఇవాళ అనూహ్యంగా 8 శాతం దాకా పెరిగింది. ఈ కౌంటర్‌లో ఎన్నడూ లేని స్థాయిలో ఇవాళ టర్నోవర్ నమోదైంది. ఇక బ్లాక్ డీల్ కారణంగా ఐటీసీ షేర్ 3 శాతం క్షీణించింది. సాగిలిటీ నష్టాలు మాత్రం నామమాత్రంగా ఉన్నాయి. ఐటీఐ ఇవాళ పది శాతం పెరగ్గా, అపోలో మైక్రో 13 వాతం పెరిగింది. అలాగే త్రివేణి ఇంజినీరింగ్ 9 శాతం పెరిగింది. ఇక నిఫ్టి షేర్ల విషయానికొస్తే హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ టాప్ గెయినర్‌గా నిలిచింది. తరవాతి స్థానాల్లో బీఈఎల్, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్ ఉన్నాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో ఇండస్ బ్యాంక్ టాప్‌లో ఉంది. తరువాతి స్థానాల్లో అపోలో హాస్పిటల్స్, అల్ట్రాటెక్ సిమెంట్, హిందాల్కో, నెస్లే షేర్లు ఉన్నాయి.