కోలుకున్నా… 17400 దిగువకు…
అంతర్జాతీయ మార్కెట్లు ముఖ్యంగా యూరప్ మార్కెట్లు అనూహ్యంగా కోలుకోవడంతో మన మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. నిఫ్టి ఒకదశలో 17300 దిగువకు అంటే 17299ని తాకినా.. మిడ్ సెషన్ తరవాత అనూహ్యంగా కోలుకున్నాయి. దిగువ స్థాయి నుంచి 93 పాయింట్లు కోలుకుని 17392 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 73 పాయింట్లు నష్టపోయింది. యూరప్ మార్కెట్లు ఒకటిన్నర నుంచి రెండు శాతం వరకు కోలుకోవడంతో బ్యాంకు నిఫ్టి ఒక శాతం వరకు పెరిగింది. దీంతో నిఫ్టి కోలుకుంది. ఇవాళ నిఫ్టి అదానీ ఎంటర్‌ప్రైజస్‌తో పాటు బజాజ్ ఆటో, యూపీఐ, టాటా స్టీల్ షేర్లు భారీ నష్టాల్లో ముగిశాయి. బ్యాంక్, ఎన్బీఎఫ్సీ షేర్లు నిఫ్టిని కాపాడాయి. ఇవాళ కూడా అదానీ గ్రూప్ షేర్లలో భారీ ఒత్తిడి వచ్చింది. ముఖ్యంగా అదానీ ఎంటర్‌ప్రైజస్ ఇవాళ 10 శాతం దాకా నష్టంతో క్లోజైంది. ఇక అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్, అదానీ టోటల్ షేర్ల పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. అవి లోయర్ సీలింగ్‌తో ట్రేడయ్యాయి. అంబుజా సిమెంట్ షేర్ ఏకంగా నాలుగున్నర శాతం నష్టపోగా, ఏసీసీ రెండు శాతం దాకా నష్టపోయింది.