For Money

Business News

గ్రీన్‌లో వాల్‌స్ట్రీట్‌

అమెరికా మార్కెట్లు గ్రీన్‌తో వారం ప్రారంభించాయి. గతవారాంతంలో భారీ నష్టాలతో ముగిసిన వాల్‌స్ట్రీట్‌కు మంచి ఓపెనింగ్‌ దొరికింది. నాస్‌డాక్‌ ఒక శాతం లాభంతో ప్రారంభమైనా.. ఇపుడు 0.63 శాతం లాభంతో ఉంది. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ కూడా 0.35 శాతం లాభంతో ఉండగా, డౌజోన్స్‌ మాత్రం కేవలం 0.15 శాతంతో ట్రేడవుతోంది. యూరో మార్కెట్లు ఇవాళ ఒకటిన్నర శాతం లాభంతో ట్రేడవుతుండగా… వాల్‌స్ట్రీట్‌లో అలాంటి ఉత్సాహం కన్పించడం లేదు. క్లోజింగ్‌కల్లా ఈ లాభాలు ఉంటాయా అన్న అనుమానాన్ని మార్కెట్‌ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. డాలర్‌ ఇండెక్స్‌ 105 దిగువనే ఉంది. అయితే క్రూడ్‌ మాత్రం ఒకటిన్నర శాతం నష్టపోయింది. బ్రెంట్‌ క్రూడ్‌ 81.74 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బులియన్‌ మాత్రం మిశ్రమంగా ఉంది. బంగారం స్వల్ప లాభంతో ఉండగా, వెండి మాత్రం ఒక శాతంపైగా నష్టంతో ఉంది.