For Money

Business News

సెన్సెక్స్‌ మరో 300 పాయింట్ల డౌన్‌

మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో ఒక మోస్తరు లాభాల్లో కొనసాగుతున్నా… మన మార్కెట్లలో మాత్రం అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన నిఫ్టి … పదింటికల్లా నష్టాల్లోకి జారకుంది. మిడ్‌ సెషన్‌లో లాభాల్లోకి వచ్చినట్లే వచ్చి… నష్టాల్లోకి జారుకుంది. యూరప్‌ మార్కెట్లు ఒక మోస్తరు లాభాల్లో ఉన్నా… మన మార్కెట్‌లో తీవ్ర అమ్మకాల ఒత్తిడి రావడంతో నిఫ్టి ఒకదశలో 17255ని తాకింది. అక్కడి నుంచి స్వల్పంగా కోలుకున్నా… 17303 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 89 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్‌ 323 పాయింట్లు తగ్గింది. మెటల్‌, హెల్త్‌ కేర్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, ఐటీ రంగానికి చెందిన షేర్లు ఒత్తిడికి లోనయ్యాయి. ఇవాళ బ్యాంకు నిఫ్టి నుంచి నిఫ్టికి ఎలాంటి మద్దతు అందలేదు. ఇక అదానీ షేర్ల విషయానికొస్తే… గత కొన్ని రోజులుగా భారీగా నష్టపోయిన అదానీ ఎంటర్‌ప్రైజస్‌ ఇవాళ 15 శాతం పెరిగి రూ. 1371.35 వద్ద ముగిసింది. అదానీ పోర్ట్స్‌ కూడా 5 శాతం పెరిగింది. అదానీ గ్రీన్‌ ఇవాళ 5 శాతం లాభంతో క్లోజ్‌ కావడం విశేషం. అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ టోటల్‌ ఇవాళ కూడా 5 శాతం నష్టంతో ముగిశాయి.గుజరాత్ అంబుజా కూడా నాలుగు శాతం వరకు లాభపడింది. వేదాంత, పే టీఎం కూడా అయిదు శాతంపైగా నష్టంతో ముగిశాయి. చాలా రోజుల తరవాత గ్లాండ్‌ ఫార్మా అయిదు శాతంపైగా పెరిగింది.