For Money

Business News

కోలుకున్నా… తప్పని సష్టాలు

ఉదయం ఒక మోస్తరు నష్టాలతో ప్రారంభమైన మార్కెట్‌ క్రమంగా మిడ్‌ సెషన్‌ వరకు బలహీనపడుతూ వెళ్ళింది. మిడ్‌ సెషన్‌లో 16958 పాయింట్లను తాకిన నిఫ్టికి యూరో మార్కెట్ల నుంచి బూస్ట్‌ లభించింది. ఆ మారెట్లన్నీ గ్రీన్లో ప్రారంభమయ్యాయి. అలాగే అమెరికా ఫ్యూచర్స్‌ కూడా గ్రీన్‌లో ఉండేసరికి నిఫ్టికి మద్దతు లభించింది. మూడు గంటలకల్లా ఉదయం స్థాయికి వచ్చేసింది. చివరి స్క్వేర్‌ ఆఫ్‌ సమయంలో కాస్త ఒత్తిడి రావడంతో 17038 వద్ద నిఫ్టి ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 162 పాయింట్లు నష్టపోయింది. ఇతర సూచీలతో పోలిస్తే నిఫ్టికి తక్కువ నష్టంతో క్లోజైందని చెప్పాలి. ఎందుకంటే నిఫ్టి నెక్ట్స్‌ 1.3 శాతం నష్టపోగా, ఇతర సూచీలన్నీ ఒక శాతంపైనే నష్టపోయాయి. ఇవాళ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌లో హీరోమోటో కార్ప్‌ టాప్‌లో నిలిచింది. ఇక నష్టాల్లో బజాజ్‌ ట్విన్స్‌ నిలిచాయి. బజాజ్‌ ఫైనాన్స్‌ ఏడు శాతంపైగా నస్టపోయింది. బజాజ్ ఫిన్‌ సర్వ్‌ నష్టాలు నాలుగు శాతం దాకా ఉన్నాయి. అదానీ కన్ను పడటంతో ఏసీసీ నిఫ్టి నెక్ట్స్‌లో టాప్‌ గెయినర్‌గా నిలిచింది.