For Money

Business News

ఎందుకు నిఫ్టి భారీగా నష్టపోయింది?

వేరే మార్కెట్లతో పోలిస్తే మన మార్కెట్లు ఒక మోస్తరు నష్టాలతో బయటపడ్డాయని అనుకోవాలి. ఇంకా లోతుగా చూస్తే మన మార్కెట్‌లో నిఫ్టి ప్రధాన షేర్లే భారీగా క్షీణించాయి. నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీ కదలికలను చూస్తే… ఫండమెంటల్స్‌ పరంగా పటిష్ఠంగా ఉన్న షేర్లు నిలదొక్కుకున్నాయి. ఉదయం 16927 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన నిఫ్టి తొలి ప్రతిఘటన వద్దే వెనక్కి మళ్ళింది. ఈ స్థాయిలో నిఫ్టిని అమ్మినవారిక ఇవాళ కనకవర్షమే. ఎందుకంటే యూరో మార్కెట్ల ఓపెనింగ్‌ తరవాత మన మార్కట్లలో తీవ్ర ఒత్తిడి వచ్చింది. అక్కడి నుంచి పడుతూ వచ్చిన నిఫ్టి 16677కి చేరింది. మార్కెట్‌లో ఏ కాస్త అనుభవం ఉన్న ఇన్వెస్టర్లకైనా నిఫ్టి రివర్సల్‌ 2.30 గంటలకు వస్తుందని తెలుసు. ఇవాళ కూడా అక్కడి నుంచి కోలుకుని 16,696 వద్ద నిఫ్టి ముగిసింది. అంటే డౌన్‌ బ్రేకౌట్‌ స్థాయిలో ఆగింది. ఇవాళ్టి గరిష్ఠ స్థాయితో పోలిస్తే నిఫ్టి 250 పాయింట్లు క్షీణించింది. డే ట్రేడర్లకు మంచి లాభాలు వచ్చినట్లే. క్రితం ముగింపుతో పోల్చితే 175 పాయింట్ల నష్టం. మెటల్స్‌ ఇవాళ మార్కెట్‌ను బాగా దెబ్బతీశాయి. డాలర్‌తో పాటు మెటల్స్‌ తగ్గడంతో పతనం అధికంగా ఉంది. మెటల్స్‌, ఆయిల్‌ భారీగా క్షీణించడం మన మార్కెట్ల అనేక షేర్లకు పాజిటివ్‌ న్యూస్‌ కావడంతో చాలా షేర్లు నష్టాలకు దూరంగా ఉన్నాయి.