For Money

Business News

ఆల్‌టైమ్‌ హైతో ముగిసిన నిఫ్టి

ఇవాళ నిఫ్టి క్లోజింగ్‌లో ఆల్‌టైమ్‌ హై నమోదు చేసింది. నిన్న ఆల్‌ టైమ్‌ హై తాకినా.. క్లోజింగ్‌లో తగ్గింది. ఇవాళ క్లోజింగ్‌లో కూడా ఆ స్థాయిని దాటింది. నిఫ్టితో పాటు సెన్సెక్స్‌ కూడా కొత్త ఆల్‌టైమ్‌ హై వద్ద ముగిసింది. ఎఫ్‌ఎంసీజీ, మెటల్స్‌లో వచ్చిన ర్యాలీ కారణంగా నిఫ్టి ఒకదశలో 18,678ని తాకింది. అయితే క్లోజింగ్‌ వచ్చిన లాభాల స్వీకరణతో 18618 వద్ద ముగిసింది. ఇవాళ కూడా సూచీలు పెరిగాయి.. షేర్ల ధరలు తగ్గాయి. నిఫ్టి బ్యాంక్‌లో ఎలాంటి కదలిక లేదు. ఇక నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీ ఏకంగా ఒక శాతం నష్టంతో ముగిసింది. మిడ్‌ సెషన్‌లో ప్రారంభమైన యూరో మార్కెట్లు ఆరంభంలో గ్రీన్లో ఉన్నాయి. దీంతో మన మార్కెట్లు కూడా పుంజుకున్నాయి. కాని క్రమేణా యూరప్‌ లాభాలు తగ్గడంతో మన మార్కెట్‌లో కూడా లాభాల స్వీకరణ వచ్చింది. అమెరికా ఫ్యూచర్స్‌ స్వల్ప లాభాల్లో ఉన్నాయి. చాలా రోజుల తరవాత హెచ్‌యూఎల్‌ నాలుగు శాతంపైగా లాభంతో ముగిసింది. నిఫ్టి షేర్లలో జేస్‌డబ్ల్యూ స్టీల్‌, సిప్లా రెండు శాతం లాభాలతో ముగిశాయి. ఇక నిఫ్టిలో టాప్‌ లూజర్‌గా ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ నిలిచింది. ఈ షేర్‌ ఒకటిన్నర శాతం నష్టపోయింది. నిఫ్టి నెక్ట్స్‌లో గ్లాండ్‌ ఫార్మా దాదాపు 8 శాతం లాభపడగా, డాబర్‌ ఆరున్నర శాతం పెరిగింది. పేటీఎం, బంధన్‌ బ్యాంక్‌లు కూడా నాలుగున్నర శాతం లాభపడ్డాయి. ఇవాళ నిఫ్టి మిడ్‌ క్యాప్‌ను లారస్‌ ల్యాబ్‌ దారుణంగా దెబ్బతీసింది. ఈ షేర్‌ 9 శాతంపైగా నష్టపోయింది. ఇండియన్‌ హోటల్‌ కూడా 3 శాతంపైగా నష్టపోయింది.