For Money

Business News

రికార్డు స్థాయిలో ముగింపు

ఉదయం ఒక దశలో నష్టాల్లోకి వెళ్ళిన నిఫ్టికి బ్యాంక్‌ షేర్ల నుంచి గట్టి మద్దతు లభించింది. రేపు మార్కెట్లకు సెలవు కావడం, వచ్చే వారం నెలవారీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ నేపథ్యంలో ఎఫ్‌ అండ్‌ ఓ విభాగంలో యాక్టివిటి జోరుగా సాగింది. ముఖ్యంగా ఇవాళ రేపు ఇన్ఫోసిస్‌తో పాటు ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఫలితాలు ఉన్నాయి. దీంతో పలు కౌంటర్లకు ముఖ్యంగా బ్యాంకింగ్‌ కౌంటర్లలో గట్టి మద్దతు లభిచించింది. ఉదయం 23298 పాయింట్ల ఉన్న నిఫ్టి సెషన్‌ కొనసాగే కొద్దీ బలపడుతూ వచ్చింది. ఒకదశలో 23872 పాయింట్లను తాకింది. దాదాపు అదే స్థాయి వద్ద అంటే 23851 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టి టాప్‌ గెయినర్స్‌లో ఎటర్నల్‌ రావడం విశేషం. తరువాతి సన్‌ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ నిలిచాయి. ఇక నష్టాల్లోవిప్రో టాప్‌లో ఉంది. హిందాల్కో, టెక్‌ మహీంద్రా, హీరో మోటో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు తరవాతి స్థానాల్లో ఉన్నాయి. ఇవాళ 2977 షేర్లు ట్రేడవగా 1047 షేర్లు నష్టాల్లో 1847 షేర్లు లాభాల్లో ముగిశాయి.