18300కి సమీపంలో నిఫ్టి
మార్కెట్ ఇవాళ ఆద్యంతం లాభాలతో కొనసాగింది. గత శుక్రవారం అమెరికా మార్కెట్లు భారీగా లాభపడినా.. మన మార్కెట్లు ఇవాళ ఓపెనింగ్‌లో చాలా స్తబ్దుగా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఆసియా మార్కెట్ల నిర్లిప్తత. డాలర్ బలహీనపడటంతో ఐటీ షేర్లకు డిమాండ్ లేకపోవడం. ఉదయం ఆరంభంలో 18100 పాయింట్ల స్థాయిని తాకిన నిఫ్టి… ఆ తరవాత క్రమంగా బలపడుతూ వచ్చింది. యూరో మార్కెట్లలో పెద్ద లాభాలు లేకున్నా… గ్రీన్లోకొనసాగడంతో మన మార్కెట్లు క్రమంగా బలపడుతూ వచ్చాయి. గత సెషన్లో హెచ్డీఎఫ్సీ ట్విన్స్ భారీగా నష్టపోయినా.. ఇవాళ ఒక శాతంపైగా లాభపడ్డాయి. ఇతర ప్రధాన ప్రైవేట్ బ్యాంకులకు మద్దతు లభించింది. వీటితో పాటు బజాజ్ ట్విన్స్‌కు మద్దతు అందడంతో నిఫ్టి ఇవాళ్టి గరిష్ఠ స్థాయి వద్దే ముగిసింది. ఇవాళ్టి గరిష్ఠ స్థాయి 18286 కాగా, 18264 వద్ద నిఫ్టి క్లోజైంది. నిఫ్టిలో 42 షేర్లు లాభాలతో ముగిశాయి. ఇవాళ అదానీ గ్రూప్ షేర్లన్నీ నష్టాలతో క్లోజయ్యాయి. అదానీ ఎంటర్ ప్రైజస్ పనితీరు మార్కెట్‌ను ఆకట్టుకోలేకపోయింది.