18200 దగ్గర్లో నిఫ్టి
ప్రపంచ మార్కెట్లకు ఇవాళ సెలవు కావడంతో… మన మార్కెట్ పాజిటివ్‌గా ముగిసింది. ఇవాళ బై ఆన్ డిప్స్‌తో ఇన్వెస్టర్లకు ఒక మోస్తరు లాభాలు దక్కాయి. రెండు సార్లు నిష్టిలో ఒత్తిడి వచ్చింది. ప్రతసారీ నిఫ్టి కోలుకోవడం విశేషం. ముఖ్యంగా చివరి గంటలో నిఫ్టి చాలా ఫాస్ట్‌గా కోలుకుంది. నిఫ్టి ఇవాళ 18215ని తాకి 18197 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 92 పాయింట్లు లాభపడటం విశేషం. ఉదయం అనలిస్టులు పేర్కొన్నట్లే చైనా ఫ్యాక్టర్‌తో మెటల్స్ షేర్లు చాలా పటిష్ఠంగా ముగిసింది. చైనా కోవిడ్ ఆంక్షలను ఎత్తివేయడంతో ఆర్థిక వ్యవస్థ మళ్ళీ స్పీడందుకుంది. పారిశ్రామిక కార్యకలాపాలు ఊపందుకోనున్నాయి. దీంతో మెటల్స్‌కు మళ్ళీ డిమాండ్ రానుంది. కనీసం మూడు నెలలు మెటల్ షేర్లు వెలుగులో ఉంటాయని అనలిస్టులు అంటున్నారు. నిఫ్టితో పాటు నాన్ నిఫ్టి మెటల్ షేర్లు ఇవాళ ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. బ్యాంక్ షేర్లు కూడా బలంగా కొనసాగాయి. నిఫ్టిలో 31 షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. ఇవాళ ఎల్ఐసీ నాలుగు శాతంపైగా పెరిగి రూ. 700పైన క్లోజైంది. అదానీ షేర్లలో ఒత్తిడి రావడం విశేషం. అదానీ టోటల్, అదానీ గ్రీన్, అదానీ ట్రాన్స్మిషన్, ఎన్డీటీవీ, అదానీ విల్మర్, అదానీ ఎంటర్‌ప్రైజస్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. స్థానిక షేర్లలో దివీస్ ల్యాబ్ ఒక శాతంపైగా క్షీణించి మళ్ళీ రూ.3400 దిగువకు వచ్చేసింది. రెయిన్బో హాస్పిటల్స్ రూ.759ని తాకి రూ. 752 వద్ద ముగిసింది.