For Money

Business News

క్లోజింగ్‌లోనూ నిఫ్టి కొత్త రికార్డు

అలసటే లేకుండా స్టాక్‌ మార్కెట్‌ పరుగులు పెడుతోంది. రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తోంది. షేర్‌ పెరగడానికి అర్హత..ఏదో ఒక వార్త చాలు. ఏదో వదంతి చాలు. పరుగులు తీస్తున్నాయి. కేవలం ఎలక్ట్రానిక్స్‌ కార్ల కోసం ఓ కంపెనీ పెడుతున్నట్లు టాటా మోటార్స్‌ ప్రకటించగానే ఆ కంపెనీ షేర్‌ 21 శాతం పెరిగిందంటేనే ఆశ్చర్యమేస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వం చేతగానితనం వల్ల దేశ వ్యాప్తంగా బొగ్గు కొరత. దీంతో ప్రైవేట్‌ విద్యుత్‌ కంపెనీల షేర్లు పరుగులు. కారణాలు ఏమైతేనేం… నిఫ్టి ఇవాళ 170 పాయింట్ల లాభంతో 18,161 పాయింట్ల వద్ద ముగిసింది. ఉదయం 18,050 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకిన నిఫ్టి అక్కడి నుంచి క్రమంగా పెరుగతూ వచ్చి ఇవాళ్టి గరిష్ఠ స్థాయి 18,197 పాయింట్లను తాకింది. నిఫ్టితో పాటు మిడ్ క్యాప్‌ ఇండెక్స్‌ కూడా 1.4 శాతం పెరిగింది. బ్యాంక్‌ నిఫ్టి మాత్రం 0.3 శాతంతో పరిమిత లాభాలతో ముగిసింది.