For Money

Business News

చివర్లో లాభాల స్వీకరణ

ఉదయం మార్కెట్‌ లెవల్స్‌ సమయంలో పేర్కొన్నట్లు ఈక్విటీ మార్కెట్లు పూర్తిగా ఆల్గో ట్రేడింగ్‌ పరిమితమయ్యాయి. 18300, 18400 వద్ద కాల్ రైటింగ్‌ అత్యధికంఆ ఉండటంతో నిఫ్టికి ఆ ప్రాంతంలో తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది. ఉదయం మార్కెట్‌ అనలిస్టులు అంచనా వేసినట్లు నిఫ్టి 18300పైన ఒత్తిడి వచ్చింది. 18325ను తాకిన నిఫ్టి తరవాత 18246 పాయింట్లకు పడింది. మిడ్‌ సెషన్‌లో ప్రారంభమైన యూరో మార్కెట్లు గ్రీన్‌లో ఉండటం సెంటిమెంట్‌ పాజిటివ్‌గానే కొనసాగింది. రేపు వీక్లీ, మంత్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ ఉండటంతో చివర్లో షార్ట్‌ కవరింగ్‌ వచ్చి నిఫ్టి 18300 స్థాయిని దాటినా… పై స్థాయిలో కాల్ రైటింగ్‌ అధికంగా ఉన్నందున నిఫ్టి మళ్ళీ క్షీణించి 18267 వద్ద ముగిసింది. ఇవాళ నిఫ్టిలో 25 షేర్లు లాభాల్లో ముగిశాయి. దాదాపు అన్ని ప్రధాన సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. నిఫ్టి బ్యాంక్‌ మాత్రం 0.64 శాతం లాభపడింది. ఇవాళ అపోలో హాస్పిటల్స్‌ మూడు శాతంపైగా లాభడింది. అలాగే హైదరాబాద్‌కు చెందిన రెయిన్‌ బో చిల్ట్రన్స్‌ షేర్‌ దాదాపు ఆరు శాతం లాభంతో ముగిసింది. గత కొన్ని రోజుల నుంచి అమ్మకాల ఒత్తిడి కారణంగా ఈ షేర్‌ రూ. 886 నుంచి పడుతూ వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు న్యూఏజ్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. పేటీఎం ఇవాళ మరో 5.6 శాతం క్షీణించి రూ. 450కి చేరింది. అలాగే జొమాటో కూడా 3.5 శాతం క్షీణించగా, నైకా రెండు శాతం తగ్గింది. ఇక మిడ్‌ క్యాప్‌ బ్యాంక్‌ షేర్లకు మద్దతు కొనసాగుతూనే ఉంది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ మరో 4 శాతం లాభపడింది. ఫెడరల్ బ్యాంక్‌ కూడా రెండు వాతం పెరిగింది.