నష్టాల నుంచి కోలుకున్న నిఫ్టి
ఇవాళ కూడా ఆల్గో ట్రేడింగ్ లెవల్స్‌కు పరిమితమైంది నిఫ్టి. 18100 – 18250 ప్రాంతంలో ట్రేడ్ రేంజ్ కాగా, నిఫ్టి చివర్లో వచ్చిన షార్ట్ కవరింగ్‌తో 18300పైకి చేరింది. కాని క్లోజింగ్ వచ్చే సరికల్లా లాభాల స్వీకరణతో తగ్గింది. ఉదయం 18,255 పాయింట్లకు చేరిన నిఫ్టి మిడ్ సెషన్‌కు ముందు 150 పాయింట్లు తగ్గి… 18100కు తగ్గింది. మళ్ళీ అక్కడి నుంచి పుంజుకుని 18310ని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే 143 పాయింట్లు పెరిగి 18,268 పాయింట్ల వద్ద ముగిసింది. ఇప్పటి వరకు నిఫ్టికి అండగా ఉన్న బ్యాంకులు ఇవాళ ముఖం చాటేశాయి. దీంతో ఇతర రంగాలు ఆదుకున్నాయి. నిఫ్టి టాప్ గెయినర్స్ మూడు టాటా గ్రూప్ షేర్లు ఉండటం విశేషం. నిఫ్టి 0.8 శాతం పెరగ్గా… నిఫ్టి నెక్ట్స్ 1.1 శాతం పెరిగింది. కాని అసలు ట్రేడింగ్ జోరు మిడ్ క్యాప్స్‌లో జరిగింది. క్రితం ముగింపుతో పోలిస్తే మిడ్ క్యాప్ సూచీ 2 శాతంపైగా పెరిగింది. ఇవాళ టాటా మోటార్స్ మళ్ళీ 6 శాతం దాకా పెరగడంతో షేర్ ధర రూ.500 దాటింది. మొన్నటిదాకా భారీగా పెరిగిన ప్రైవేట్ బ్యాంకు షేర్లు ఇవాళ చల్లబడ్డాయి.