For Money

Business News

చివర్లో భారీ జంప్‌

ఉదయం కొద్దిసేపు నష్టాల్లో ఉన్న నిఫ్టి.. తరవాత రోజంతా గ్రీన్‌లోనే కొనసాగింది. అయితే స్థిరంగా ఒక మోస్తరు లాభాలో కొనసాగింది. మిడ్‌ సెషన్‌లో యూరో మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభం కావడంతో నిఫ్టిలో ఉత్సాహం కొరవడింది. క్రమంగా యూరో మార్కెట్లు కోలుకుని అరశాతంపైగా లాభంలోకి చేరుకునే సరికి.. నిఫ్టి కూడా 18267 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకి 18244 వద్ద ముగిసింది. నిఫ్టికి ఇవాళ కూడా 18150 ప్రాంతంలో మద్దతు లభించడం విశేషం. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టిట 84 పాయింట్లు లాభపడింది. ఫలానా రంగమంటూ లేకుండా.. బ్లూచిప్స్‌ ఇవాళ నిఫ్టికి అండగా నిలిచాయి. నిఫ్టి నెక్ట్స్‌లో కూడా ఇదే ట్రెండ్‌ కన్పించింది. అయితే న్యూఏజ్‌ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ఇక అన్ని సూచీలన్నా అధికంగా లాభపడింది నిఫ్టి బ్యాంక్‌. గత కొన్ని నెలలుగా నిఫ్టి పూర్తిగా బ్యాంక్‌ నిఫ్టిపైనే ఆధారపడుతోంది. అందుకే అనలిస్టలు నిఫ్టి ట్రెండ్‌ చూసి… నిఫ్టి బ్యాంక్‌లో ట్రేడ్‌ చేయమని సలహా ఇస్తున్నారు. గతకొన్ని రోజులుగా బై ఆన్‌ డిప్స్‌ ఫార్ములా డే ట్రేడర్లకు మంచి లాభాలను ఇస్తోంది. ఇవాళ కూడా అదే జరిగింది.