నైకా సీఎఫ్‌ఓ రాజీనామా
బ్యూటీ ఈ రీటైలర్ నైకా కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ) అరవింద్ అగర్వాల్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామా ఈనెల 25వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని కంపెనీ పేర్కొంది. కొత్త సీఎఫ్‌ఓను నియమించే ప్రయత్నంలో ఉన్నట్లు నైకా స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది.2020 జులైలో అరవింద్ అగర్వాల్ కంపెనీలో చేరారు. ఐపీఓ సమయంలో ఇన్వెస్ట్ చేసిన యాంకర్ ఇన్వెస్టర్ల లాకిన్ పీరియడ్ పూర్తవుతున్న సమయంలో బోనస్ షేర్ల రికార్డు తేదీ నిర్ణయించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. లాకిన్ పీరియడ్‌ను పెంచడం వల్ల వెంటనే ఇన్వెస్టర్లు తమ షేర్లను అమ్మలేకపోయారు. దీంతో బోనస్‌గా వచ్చిన షేర్లలో చాలా వాటికి 15 శాతం పన్ను కట్టాల్సి వచ్చిందనే ఆరోపణలు ఉన్నాయి. లాకిన్ నవంబర్ 10వ తేదీతో పూర్తయింది. అప్పటి నుంచి వరుసగా యాంకర్ ఇన్వెస్టర్లు తమ షేర్లను అమ్మతున్నారు. ఇప్పటికు వరకు 67 శాతం మంది తమ షేర్లను అమ్ముకున్నారు. ఇవాళ కూడా లైట్‌హౌస్ ఇండియా తమ షేర్లను అమ్మింది. లాకిన్ పిరయడ్ పూర్తి కావడం, అదే సమయంలో బోనస్ షేర్ల జారీ వంటి అంశాలతో కంపెనీ కార్పొరేట్ గవర్నెన్స్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి.