For Money

Business News

18,000పైన ముగిసిన నిఫ్టి

అంతర్జాతీయ సానుకూల సంకేతాల మధ్య నిఫ్టి 18000పైన ముగిసింది. గత సెప్టెంబర్‌ 24 తరవాత నిఫ్టి మళ్ళీ 18000ను దాటింది. ఒకదశలో 18022ను తాకిన నిఫ్టి 18012 వద్ద ముగియడం విశేషం. నిఫ్టి క్రితం ముగింపుత పోలిస్తే ఏకంగా 225 పాయింట్లు లాభపడింది. ఇవాళ్టి దిగువస్థాయి నుంచి నిఫ్టి వంద పాయింట్లు కోలుకోవడం కష్టం. నష్టాల్లో ప్రారంభమైన యూరో మార్కెట్లు గ్రీన్‌లోకి మారడంతో మన మార్కెట్‌లో సెంటిమెంట్‌ మరింత బలపడింది. నిఫ్టిలో 44 షేర్లు గ్రీన్‌లో ముగిశాయి. అన్ని సూచీలకన్నా అధికంగా నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీ 1.77 శాతం లాభపడింది. ఇక నిఫ్టి షేర్లలో అల్ట్రాటెక్ సిమెంట్‌ 4 శాతంపైగా లాభంతో ముగిసింది. అలాగే ఐషర్‌ మోటార్స్‌, ఎం అండ్‌ ఎం, హెచ్‌డీఎఫ్‌సీలో నిఫ్టి టాప్‌ గెయినర్స్‌లో ఉన్నాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో అపోలో హాస్పిటల్‌ ఉంది. ఈ షేర్‌ 1.25 శాతం నష్టపోయింది. అదానీ టోటల్‌ 6 శాతం, శ్రీ సిమెంట్‌ షేర్లు 4 శాతంపైగా లాభంతో ముగిశాయి. ఇక నిఫ్టి మిడ్‌ క్యాప్‌లో ట్రెంట్‌, ఆస్ట్రాల్‌, ఇండియన్‌ హెటల్‌, ఏబీబీ, జూబ్లియంట్‌ ఫుడ్‌ షేర్లు మూడు శాతంపైగా లాభంతో ముగిశాయి. ఏయూ బ్యాంక్‌ ఉదయం రూ. 577ను తాకినా క్లోజింగ్‌లో రూ. 590 వద్ద ముగిసింది.