18000పైన ముగిసిన నిఫ్టి
ప్రపంచ మార్కెట్లు భారీ నష్టాలను బేఖాతరు చేస్తూ నష్టాల నుంచి పూర్తిగా కోలుకుని నిఫ్టి లాభాల్లోకి వచ్చింది. రేపు వీక్లీ డెరివేటివ్ క్లోజింగ్ ఉండటంతో స్వల్ప నష్టాలతో ముగిసింది. నిన్న అమెరికా, ఇవాళ ఉదయం ఆసియా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. మిడ్‌సెషన్‌లో ప్రారంభమైన యూరో మార్కెట్లు కూడా భారీ నష్టాల నుంచి కోలుకున్నాయి. స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి. భారీ పతనం తరవాత వాల్‌స్ట్రీట్ ఫ్యూచర్స్ గ్రీన్‌లో ఉండటంతో నిఫ్టి 18003 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 66 పాయింట్లు నష్టపోయింది. ఇవాళ మార్కెట్‌ను బ్యాంకింగ్ షేర్లు కాపాడాయి. ఒకదశలో నష్టాలో ఉన్న బ్యాంక్ నిఫ్టి క్లోజింగ్‌కల్లా 1.3 శాతం లాభంతో క్లోజైంది. అలాగే నిఫ్టి నెక్ట్స్ కూడా 0.46 శాతం లాభంతో ముగిసింది. నిఫ్టి బ్యాంక్‌లో 12 షేర్లు ఉండగా ఒక్క యాక్సిస్ బ్యాంక్ మినహా.. మిగిలిన 11 షేర్లు లాభాల్లో ముగియడం విశేషం. ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్ 4 శాతంపైగా లాభపడింది. నిఫ్టి గెయినర్స్లోనూ టాప్‌లో నిలిచింది. ఎస్బీఐ, కొటక్ బ్యాంక్ కూడా టాప్ 5లో ఉన్నాయి. ఇక నిఫ్టిలో నష్టాల్లో ముగిసిన టాప్ షేర్లన్నీ ఐటీ రంగానికి చెందినవి కావడం విశేషం. ఇన్ఫోసిస్ 4.5 శాతం నష్టంతో క్లోజ్ అయింది. ఇక నిఫ్టి నెక్ట్స్‌లో వేదాంత 9.87 శాతం. బజాజ్ హోల్డింగ్స్ 8 శాతం పైగా పెరిగాయి. ఇక అదానీ గ్రూప్‌నకు చెందిన అంబుజా సిమెంట్, ఏసీసీ షేర్లు ఆరు శాతంపైగా పెరగడం విశేషం.