17800 పైన ముగిసిన నిఫ్టి
ఇవాళ కూడా మార్కెట్లో అప్‌ట్రెండ్ కొనసాగింది. నిఫ్టి 17800 స్థాయిని దాటింది. క్రితం ముగింపుతో పోలిస్తే 90 పాయింట్ల లాభంతో 17812 వద్ద ముగిసింది. చివరల్లో స్వల్ప ఒత్తిడి వచ్చినా… వెంటనే కోలుకుంది. మిడ్ క్యాప్ సూచీ 0.7 శాతం లాభపడగా. మిగిలిన సూచీలు సుమారు అర శాతం మేర పెరిగాయి. నిఫ్టిలో 34 షేర్లు లాభాల్లో ముగిశాయి. చాలా రోజుల తరవాత దివీస్ ల్యాబ్ దాదాపు పది శాతం లాభంతో 3209 వద్ద ముగిసింది. నిఫ్టి టాప్ గెయినర్స్‌లో టాప్‌లో నిలిచింది.బజాజ్ ఆటో రెండున్నర శాతం లాభపడగా, తరవాతి స్థానంలో అదానీ ఎంటర్‌ప్రైజస్ కూడా ఇదే స్థాయి లాభాలతో ముగిసింది. ఇవాళ నష్టపోయిన షేర్లలో పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ షేర్లు ఉన్నాయి. నిఫ్టి నెక్ట్స్ షేర్లలో పేజ్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో ఉండగా, గెయిల్ కూడా రెండున్నర శాతం లాభంతో ముగిసింది. అదానీ టోటల్, అదానీ విల్మర్ షేర్లు ఒక శాతం నష్టంతో ముగిశాయి. నైకా కూడా ఒక శాతం నష్టంతో రూ. 127 వద్ద ముగిసింది.