For Money

Business News

వడ్డీ రేట్లు తగ్గించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

మార్జినల్‌ కాస్ట్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేట్‌ (MCLR)ను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తగ్గించింది. ఎంపిక చేసిన కొన్ని వ్యవధులు ఉన్న రుణాలపై వడ్డీని 0.85 శాతం తగ్గించనున్నట్లు బ్యాంక్‌ వెల్లడించింది. కొత్త రేట్లు ఏప్రిల్‌ 10వ తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. ఇప్పటి వరకు MCLR రేటు 8.65 శాతం ఉండగా, ఇపుడు 7.80 శాతానికి తగ్గించారు. ఒక నెల ఎంసీఎల్‌ఆర్‌ను 0.7 శాతం తగ్గించినట్లు బ్యాంక్‌ పేర్కొంది. అలాగే మూడు నెలల ఎంసీఎల్‌ఆర్‌ను 0.4 శాతం తగ్గించింది. అదే ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్‌ను 8.8 శాతం నుంచి 8.7 శాతానికి తగ్గించినట్లు పేర్కొంది. ఏడాది, ఆపై వ్యవధిగల రుణాలపై మాత్రం వడ్డీ రేట్లు తగ్గించలేదు.