For Money

Business News

యూపీఐ పేమెంట్లకూ EMI..

ఐసీఐసీఐ బ్యాంక్‌ తమ కస్టమర్ల కోసం కొత్త సదుపాయాన్ని తీసుకు వచ్చింది. యూపీఐ ద్వారా చేసే చెల్లింపులను కూడా ఈఎంఐ కింద మార్చుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది. యూపీఐ ద్వారా ఏ వస్తువునైనా కొనుగోలు చేసినా ఆ మొత్తాన్ని ఈఎంఐ కింద మార్చుకోవచ్చని పేర్కొంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ అందించే ‘పే లేటర్‌’ (Pay Later) ఆప్షన్‌తో ఈ సదుపాయాన్ని ఖాతాదారులు వాడుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్‌, ఫ్యాషన్, దుస్తులు, గృహోపకరణాలు వంటి వాటికి ఈ ఈఎంఐ సదుపాయం వర్తిస్తుందని బ్యాంక్‌ తెలిపింది. ఆన్‌లైన్‌ పేమెంట్లకూ త్వరలో ఈ సదుపాయాన్ని విస్తరించాలని ఐసీఐసీఐ బ్యాంక్‌ భావిస్తోంది. రూ.10 వేల కంటే ఎక్కువ మొత్తాలను ఈఎంఐ కింద మార్చుకోవచ్చు. మూడు, ఆరు, తొమ్మిది నెలలు కాలవ్యవధుల్లో చెల్లింపులకు అవకాశం ఉంటుంది. పే లేటర్‌ సదుపాయాన్ని 2018లో ఐసీఐసీఐ బ్యాంక్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే.