17300పైన ముగిసిన నిఫ్టి
ఒకదశలో 17166 పాయింట్లకు క్షీణించిన నిఫ్టి… ఆరంభం నుంచి కోలుకుంటూ వచ్చినా అధిక స్థాయిలో మళ్ళీ ఒత్తిడిని ఎదుర్కొంది. 17380ని తాకినా.. లాభాల స్వీకరణ కారణంగా 17312 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 246 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టిలో 38 షేర్లు నష్టాలతో ముగిశాయి. నిఫ్టి నెక్ట్స్ మినహా మిగిలిన కీలక సూచీలన్నీ భారీ నష్టాలతో ముగిశాయి. నిఫ్టి బ్యాంక్ 1.82 శాతం , నిఫ్టి మిడ్ క్యాప్ 1.42 శాతం నష్టపోగా… నిఫ్టి నెక్ట్స్ 0.6 శాతం నష్టానికి పరిమితమైంది. నిఫ్టి ఐటీ మాత్రం 3.53 శాతం నష్టంతో ముగిసింది. ఎఫ్ఎంసీజీ నిఫ్టి మాత్రం గ్రీన్‌లో ముగిసింది. ఈ రంగానికి చెందిన బ్రిటానియా, నెస్లే, కాల్గేట్ పామోలిన్ షేర్లు లాభాల్లో ముగిశాయి. క్రూడ్ ధరలు పెరిగినా ఏషియన్ పెయింట్స్ ఇవాళ స్వల్ప లాభంతో ముగిసింది. ఇక నష్టాల సేర్లలో ఐటీ షేర్లదే అ్రగస్థానం. నిఫ్టి టాప్ ఫైవ్ లూజర్స్‌లో నాలుగు ఐటీ షేర్లు ఉండటం విశేషం. నిఫ్టి నెక్ట్స్‌లో కూడా ఐటీ మిడ్ క్యాప్ షేర్లు భారీగా క్షీణించాయి. నౌకరీ, పే టీఎం, మైండ్ ట్రీ షేర్లు భారీగా క్షీణించాయి. ఐఆర్సీటీసీ ఇవాళ మూడు శాతంపైగా క్షీణించింది. బ్యాంక్ షేర్లలో బంధన్ బ్యాంక్ నాలుగు శాతం నష్టంతో ముగిసింది.