అంతర్జాతీయ మార్కెట్ల జోరుతో…
ఉదయం అమ్మకాల ఒత్తిడికి లోనైన నిఫ్టి… క్రమంగా బలపడుతూ మిడ్ సెషన్ తరవాత భారీ లాభాల్లోకి వెళ్ళింది. ఉదయం 17,071 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకిని నిఫ్టికి దిగువ స్థాయిలో మద్దతు అందింది. అలాగే వీక్లీ, మంత్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ కావడంతో పలు షేర్లలో వచ్చిన షార్ట్ కవరింగ్ కూడా తోడైంది. ఎల్‌ఐసీ పబ్లిక్ ఆఫర్ నేపథ్యంలో ప్రైవేట్ లైప్ ఇన్సూరెన్స్ కంపెనీల రీరేటింగ్ కూడా జరుగుతోంది. వెరశి ఇవాళ మార్కెట్ క్లోజింగ్‌కు ముందు 17322ను తాకింది. చివర్లో వచ్చిన లాభాల స్వీకరణ కారణంగా 17245 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 206 పాయింట్లు లాభపడింది. యూరో మార్కెట్లు దాదాపు 1.6 శాతంపైగా లాభంతో ట్రేడ్ కావడంతో అమెరికా ఫ్యూచర్స్ ఆకర్షణీయ లాభాల కారణంగా మార్కెట్ సెంటెమెంట్ మెరుగైంది. నిఫ్టిలో 45 షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇవాళ నిఫ్టి బ్యాంక్ నుంచి కూడా నిఫ్టి మద్దతు లభించింది. ఇవాళ అత్యధికంగా లాభపడిన ప్రధాన సూచీ నిఫ్టి నెక్ట్స్ (1.37 శాతం). నిఫ్టిలో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, హెచ్‌యూఎల్ నాలుగు శాతంపైగా పెరగ్గా… రెండు శాతం నష్టంతో టాప్ లూజర్‌గా బజాజ్ ఆటో నిలిచింది.