For Money

Business News

హైద‌రాబాద్‌లో గూగుల్ క్యాంప‌స్‌కు శంకుస్థాపన

అమెరికాలోని మౌంట్‌ వ్యూలోని తన ప్రధాన కార్యాలయం తరవాత అతి పెద్ద ఆఫీస్‌ను గూగుల్‌ హైదరాబాద్‌లో నిర్మిస్తోంది. 33 లక్షల చదవరపు అడుగుల ఈ క్యాంప్‌కు ఇవాళ మంత్రి కేటీఆర్‌ భూమి పూజల చేశారు. రానున్న రోజుల్లో హైదరాబాద్‌లో ఇదొక ల్యాండ్‌ మార్క్‌ కానుందని ఆయన పేర్కొన్నారు. గూగుల్‌ అందిస్తున్న సహకారానికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, గూగుల్ సంస్థ మ‌ధ్య అవ‌గాహ‌న ఒప్పందం కుదిరింది. పౌర సేవ‌లు, విద్య, ఇత‌ర రంగాల్లో ప్రభుత్వానికి గూగుల్ సాంకేతిక స‌హ‌కారాన్ని అందించ‌నుంది. ఇప్పటికే అనేక ప్రాజెక్టుల్లో గూగుల్‌తో క‌లిసి ప‌ని చేస్తున్నామ‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ ఒప్పందంతో మ‌రింత మెరుగైన సేవ‌లు అందించేందుకు అవ‌కాశం ఏర్పడుతుంద‌ని కేటీఆర్ ధీమా వ్య‌క్తం చేశారు. హైద‌రాబాద్‌లో గూగుల్ త‌న మూలాల‌ను మ‌రింత బ‌లోపేతం చేసుకోవ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. గూగుల్ 2017 నుంచి తెలంగాణ ప్రభుత్వంతో క‌లిసి ప‌ని చేస్తోంద‌ని తెలిపారు. ఇంత‌కు ముందు చేసుకున్న ఎంవోయూలు గొప్ప కార్యక్రమాల‌కు దారి తీశాయ‌న్నారు. యువ‌త‌, మ‌హిళ‌లు, విద్యార్థులు, పౌర‌సేవ‌ల్లో మార్పు తీసుకురావ‌డంపై దృష్టి సారించామ‌ని కేటీఆర్ పేర్కొన్నారు.