నిఫ్టి పరుగు ఆపతరమా….!
ఉదయం ఆరంభంలో తడబడిన నిఫ్టి ఆ తరవాత క్రమంగా పుంజుకుంటూ వెళ్ళింది. ప్రపంచ మార్కెట్లు డల్‌గా ఉన్నా… మన మార్కెట్ దూసుకు పోతోంది. నిఫ్టి ఇవాళ ఉదయం ఆరంభంలోనే 17,059 పాయింట్లను తాకినా.. అక్కడి నుంచి 185 పాయింట్లు బలపడింది. మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలు ఏవీ లేవు. కేవలం విదేశీ, స్వదేశీ ఇన్వెస్టర్ల ఆట. నిఫ్టి ఇవాళ17,245 పాయింట్లను తాకి క్రితం ముగింపుతో పోలిస్తే 158 పాయింట్ల లాభంతో 17,234 పాయింట్ల వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టి అరశాతంపైగా పెరగ్గా.. మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.4 శాతం పెరిగింది. ప్రత్యేకంగా ఒక రంగానికి ప్రాధాన్యం లేదు. కేవలం నిఫ్టిని పెంచే యత్నం మాత్రమే. చిన్న ఇన్వెస్టర్లూ బహుపరాక్. ఇప్పటికే నిఫ్టిలో ఉన్నవారు.. స్టాప్‌లాస్‌తో కొనసాగవచ్చేమోగాని.. కొత్తగా మాత్రం ఇన్వెస్ట్ చేయొద్దు.
నిఫ్టి టాప్ గెయినర్స్
శ్రీసిమెంట్ 30,180.00 5.98
హెచ్డీఎఫ్సీ లైఫ్ 760.00 5.77 సిప్లా 955.00 3.48
టీసీఎస్ 3,827.90 3.04
హిందుస్థాన్ లీవర్ 2,801.10 2.50
నిఫ్టి టాప్ లూజర్స్
ఎం అండ్ ఎం 755.00 -1.94
ఓఎన్జీసీ 118.60 -0.92
బజాజ్ ఆటో 3,726.00 -0.86
దివీస్ ల్యాబ్ 5,163.00 -0.76
టాటా మోటార్స్ 293.05 -0.75