16,600పైన ముగిసిన నిఫ్టి
చివర్లో వచ్చిన షార్ట్ కవరింగ్‌తో నిఫ్టి 16600పైన ముగిసింది. చివరల్లో16,626 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన నిఫ్టి 16,605 వద్ద ముగిసింది. వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ కారణంగా చివరల్లో పలు షేర్లలో షార్ట్ కవరింగ్ వచ్చింది. ఉదయం నష్టాలతో ప్రారంభమైన నిఫ్టి తరవాత లాభాల్లోకి వచ్చింది. ఒకదశలో మళ్లీ లాభాలన్నీ కరిగిపోయిన సమయంలో నిఫ్టి అనూహ్యంగా పుంజుకుని ఇవాళ్టి గరిష్ఠ స్థాయిని తాకింది. నిఫ్టి అర శాతం లాభపడగా, నిఫ్టి నెక్ట్స్ 1.47 శాతం లాభపడింది. నిఫ్టి మిడ్ క్యాప్ 1.09 శాతం, నిఫ్టి బ్యాంక్ 0.64 శాతం లాభంతో ముగిశాయి. నిఫ్టి 42 షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ 8 శాతం, బజాజ్ ఫైనాన్స్ 3 శాతంపైన లాభంతో ముగిశాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ 2 శాతం దాకా నష్టపోయింది. నిఫ్టి నెక్ట్స్‌లో గెయినర్స్‌లో టాప్ 5 షేర్లు మూడు శాతంపైగా లాభపడ్డాయి.