పడి లేచిన నిఫ్టి
ఆర్బీఐ పరపతి విధానం తరవాత భారీ లాభాల నుంచి నిఫ్టి దాదాపు వంద పాయింట్లు క్షీణించింది. ఉదయం 17,941 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన నిఫ్టి మిడ్‌సెషన్ కల్లా 17840కి క్షీణించింది. ఆ తరవాత క్రమంగా కోలుకుంటూ 17,895 వద్ద ముగిసింది. షేర్ల విషయానికి వస్తే అంతా మిశ్రంగా ఉంది. ఫైనాన్షియల్ షేర్లతో పాటు నిఫ్టి నెక్ట్స్ నష్టాలతో ముగిశాయి. నిఫ్టి మిడ్ క్యాప్ కూడా అర శాతం కూడా పెరగలేదు. బ్యాంక్ నిఫ్టి నామ మాత్రంగా ముగిసింది. ఆర్బీఐ పరపతి విధానం తరవాత బ్యాంకు షేర్ల లాభాలన్నీ కరిగి పోయాయి. సాయంత్ర టీసీఎస్ ఫలితాలు ఉన్నందున ఐటీ షేర్లు పెరిగాయ. అలాగే రిలయన్స్ కూడా. నిఫ్టి 23 షేర్లు లాభపడితే… 27 షేర్లు నష్టాలతోముగిశాయి.