భారీ నష్టాల్లో ముగిసిన నిఫ్టి
అంతర్జాతీయ మార్కెట్లలో భారీ అమ్మకాలు సాగుతున్నాయి. ప్రపంచ మార్కెట్లన్నీ ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిలో ట్రేడవుతున్నాయి. పడటానికి ఏదో ఒక సాకు కోసం ఎదురు చూస్తున్న మార్కెట్లు ఇపుడు కరోనా కేసులంటూ పతనమౌతున్నాయి. గత శుక్రవారం అమెరికా మార్కెట్లు ఒక శాతం దాక నష్టపోగా.. ఇవాళ ఫ్యూచర్స్ ఒక శాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. ఉదయం దాదాపు రెండు శాతం నష్టంతో ఆసియా మార్కెట్లు క్లోజ్ కాగా, కొన్ని మార్కెట్లు ఒక మోస్తరు నష్టాలకు పరిమితమయ్యాయి. ఉదయం నామమాత్రపు నష్టాలతో ఉన్న అమెరికా ఫ్యూచర్స్ యూరప్ మార్కెట్ల ఓపెన్ తరవాత భారీగా క్షీణించాయి. దీంతో యూరో మార్కెట్లు రెండు శాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. యూరో స్టాక్స్ 50 సూచీ రెండు శాతంపైగా నష్టంతో ఉంది. ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు మార్కెట్‌ను దారుణంగా దెబ్బతీశాయి. బ్యాంక్ రుణాలు దాదాపు ఎలాంటి వృద్ధి లేకపోవడంతో… దేశ ఆర్థిక వ్యవస్థ స్థితి దారుణంగా ఉందన్న విషయం మరోసారి రూఢి అయింది. బ్యాంక్ నిఫ్టి ఏకంగా రెండు శాతం క్షీణించడానికి ఇదే కారణం. కొన్ని షేర్లు నామ మాత్రపు లాభాలతో ట్రేడవుతున్నా… నిఫ్టిలో 39 షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఉదయం 15730 ప్రాంతంలో కొన్నవారికి వంద పాయింట్ల లాభం దక్కింది. అక్కడి నుంచి మళ్ళీ అమ్మినవారికి భారీ లాభాలు దక్కాయి. ఎందుకంటే నిఫ్టి ఒకదశలో 15707 పాయింట్ల స్థాయిని తాకింది. తరవాత కోలుకుని 15,752 పాయింట్ల వద్ద 171 పాయింట్ల నష్టంతో క్లోజైంది. మిడ్ క్యాప్ షేర్ల సూచీ ఒక శాతం నష్టానికి పరమితమైంది.
నిఫ్టి టాప్ గెయినర్స్
ఎన్టీపీసీ 121.50 2.02
బీపీసీఎల్ 455.00 1.56
దివీస్ ల్యాబ్ 4,805.00 1.00
నెస్లే ఇండియా 17,760.00 0.60
టాటా కన్జూమర్ 766.20 0.42
నిఫ్టి టాప్ లూజర్స్
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1,472.40 -3.28 ఇండస్ ఇండ్ బ్యాంక్ 1,015.00 -2.81
హెచ్డీఎఫ్సీ లైఫ్ 678.85 -2.74
యాక్సిస్ బ్యాంక్ 754.00 -2.22
హెచ్డీఎఫ్సీ 2,482.50 -2.14