For Money

Business News

చివరిదాకా కొనసాగిన అమ్మకాలు

అంతర్జాతీయ మార్కెట్ల పతనం చూసి… మన తక్కువ నష్టాల్లో ఉన్నామని సంతోషించడం తప్ప… మార్కెట్‌ అధిక స్థాయిలో నిలబడలేకపోతోంది. బేర్‌ ఆపరేటర్లు పట్టు మార్కెట్‌పై బిగిస్తోంది. మార్కెట్‌ను షార్ట్‌ చేసినవారికి వొద్దంటే డబ్బు అన్న రీతీలో లాభాలు వచ్చి పడుతున్నాయి. మార్కెట్‌కు రెండో అతి పెద్ద మద్దతు స్థాయి అయిన 16800ని కూడా నిఫ్టి ఇవాళ బ్రేక్‌ చేయడం గమనార్హం. తరవాత స్వల్పంగా కోలుకుని 16818 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 40 పాయింట్లు క్షీణించింది. నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీ ఒక్కటే గ్రీన్‌లో ముగిసింది. మిగిలిన ప్రధాన సూచీలన్నీ నష్టాల్లోనే ముగిశాయి. శ్రీసిమెంట్‌ ఇవాళ్టితో నిఫ్టి నుంచి వైదొలగుతోంది. ఈ కౌంటర్‌ భారీ ఎత్తున షార్ట్‌ కవరింగ్‌ రావడంతో షేర్‌ 3.5 శాతం లాభంతో ముగిసింది. అలాగే క్రూడ్‌ ధరలు పెరగడంతో ఓఎన్‌జీసీ లాభపడింది. మెటల్స్‌లో హిందాల్కో కౌంటర్‌లో కూడా షార్ట్‌ కవరింగ్‌ భారీగా వచ్చింది. లాభాల స్వీకరణ కారణంగా ఏషియన్‌ పెయింట్స్‌ 4.72 శాతం క్షీణించడం విశేషం. చాలా మంది అనలిస్టులు ఈ షేర్‌ను రూ.3750 టార్గెట్‌గా రెకమెండ్‌ చేశారు. కాని షేర్‌ ఇవాళ రూ.3402 వద్ద ముగిసింది. జొమాటొ ఇవాళ ఆరున్నర శాతం లాభపడటం విశేషం. అదానీ గ్రూప్‌లోమెజారిటీ షేర్లు నష్టాల్లో ముగిశాయి. రేపటి నుంచి అదానీ ఎంటర్‌ప్రైజస్‌ నిఫ్టి50 సూచీలోకి రానుంది. ఇవాళ ఆ షేర్‌ 2.5 శాతం నష్టంతో ముగిసింది.