16,800కు చేరువలో నిఫ్టి
ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నా… మన మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 16788ని తాకింది. ఇపుడు 16774 వద్ద 113 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టికి పోటీగా నిఫ్టి బ్యాంక్ పెరుగుతోంది. నిఫ్టి 0.8 శాతం పెరగ్గా, నిఫ్టి బ్యాంక్ ఒక శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టి నెక్ట్స్, నిఫ్టి మిడ్ క్యాప్ సూచీలు మాత్రం అర శాతం లాభానికే సరిపెట్టుకున్నాయి. ఒక్క ఫార్మా కౌంటర్లు మినహా మిగిలిన రంగాల సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. అలాగే భారీ నష్టాలు ప్రకటించిన టాటా మోటార్స్ 2 శాతం నష్టంతో ట్రేడవుతోంది. సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, సిప్లా షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అయితే దివీస్ ల్యాబ్ మాత్రం రూ. 3800 వద్ద లాభంతో ట్రేడవుతోంది. మూడు నెలల్లో ఈ షేర్ రూ. 3300 నుంచి రూ. 3800లకు చేరింది. లాభాల్లో ప్రారంభమైన జొమాటో ప్రస్తుతం నష్టాల్లోకి జారుకుంది.