For Money

Business News

డిక్సన్‌ టెక్‌లో లాభాల స్వీకరణ

డిక్సన్‌ టెక్నాలజీ ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించినా… ఈ కౌంటర్‌లో అమ్మకాల ఒత్తిడి వస్తోంది. ఈ షేర్‌ ప్రస్తుతం రూ.70 నష్టంతో రూ. 3630 వద్ద ట్రేడవుతోంది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ టర్నోవర్‌ 53 శాతం పెరిగి రూ. 2855 కోట్లకు చేరగా, నికర లాభం రెట్టింపు అయింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ నికర లాభం రూ. 18.16 నుంచి రూ. 45.43 కోట్లకు పెరిగింది. కంపెనీ షేర్‌ గత వారం రూ. 4000లకు చేరింది. అక్కడి నుంచి క్రమంగా క్షీణిస్తూ కేవలం ఒక వారంలోనే రూ. 3630కి క్షీణించింది. నిన్న రూ. 3700 వద్ద ముగిసిన ఈ షేర్‌… ఉదయం నుంచి మార్కెట్‌ లాభాల్లో ఉన్నా… షేర్‌ మాత్రం నష్టాల్లో ట్రేడవుతోంది.