నిఫ్టి సూపర్ ఓపెనింగ్
ఓపెనింగ్‌లోనే నిఫ్టి దాదాపు 16200 స్థాయిని చేరింది. 16199ని తాకిన తరవాత నిఫ్టి ఇపుడు 16177 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 128 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టి 0.8 శాతం లాభం ఉండగా, ఇతర సూచీ కూడా దాదాపు ఇదే స్థాయి లాభాలతో ట్రేడవుతున్నాయి. ఇన్ఫోసిస్ చాలా రోజుల తరవాత నిఫ్టిలో టాప్ గెయినర్‌గా నిలిచింది. హిందాల్కో రెండు శాతంపైగా లాభంతో ఓపెన్ కావడం విశేషం. నిఫ్టిలో 46 షేర్లు లాభాల్లో ఉన్నాయి. కేవలం నాలుగు షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అయితే ఇవన్నీ నామమాత్రపు నష్టాల్లో. మొన్న ఫలితాలు ప్రకటించిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఇవాళ ఓపెనింగ్‌లో ఒక శాతం నష్టపోయినా… వెంటనే నష్టాలను కవర్ చేసుకుంది. ఫార్మా కౌంటర్లలో కొనుగోళ్ళు కొనసాగుతున్నాయి. దివీస్ ల్యాబ్ ఇవాళ కూడా రూ. 55 పెరిగింది. అదానీ షేర్లు గ్రీన్‌లో ఉన్నా.. అదానీ విల్మర్ మాత్రం రూ. 622 ప్రాంతంలో స్వల్ప నష్టంతో ఉంది.