21500పైన నిఫ్టి
గిఫ్ట్ నిఫ్టి సూచించినట్లే నిఫ్టి ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమైంది. 21544 స్థాయిని తాకిన నిఫ్టి ఇపుడు 21516 వద్ద 75 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. దాదాపు అన్ని ప్రధాన సూచీలు లాభాల్లో ఉన్నాయి. ముఖ్యంగా స్మాల్, మిడ్ క్యాప్ సూచీలకు పరుగుకు అంతే లేకుండా ఉంది. నిఫ్టి మిడ్ క్యాప్ సూచీ 10300 స్థాయిని దాటింది. నిఫ్టిలో 37 షేర్లు లాభాల్లో ట్రేడవుతుండగా, 12 షేర్లు నష్టాలతో ఉన్నాయి. ఇవాళ సిమెంట్ షేర్లు వెలుగులో ఉన్నాయి. నిఫ్టిలో అల్ట్రాటెక్ సిమెంట్ 3 శాతం లాభంతో టాప్ గెయినర్‌గా ఉంది. బజాజ్ ఫైనాన్స్ రెండు శాతం పెరిగింది. ఇక నిఫ్టి టాప్ లూజర్స్‌లో బ్రిటానికి టాప్‌లో ఉంది. ఇక మిడ్ క్యాప్ షేర్ల విషయానికొస్తే గ్రోద్రేజ్ ప్రాపర్టీస్, బంధన్ బ్యాంక్ చెరో 1.5 శాతం లాభంతో టాప్‌లో ఉన్నాయి. నిఫ్టి నెక్ట్స్ 50 సూచీలో అంబుజా సిమెంట్ 2.5 శాతం లాభంతో టాప్‌లో ఉంది. అలాగే శ్రీ సిమెంట్ కూడా దాదాపు రెండు శాతం లాభంతో ట్రేడవుతోంది.