For Money

Business News

కెనరా బ్యాంక్‌ ఏఎంసీ పబ్లిక్‌ ఆఫర్‌

కెనరా బ్యాంక్‌ తన అనుబంధ సంస్థ అయిన కెనరా రొబెకొ అసెట్‌ మేనేజ్మెంట్‌ కంపెనీని స్టాక్‌ ఎక్స్ఛేంజీలో లిస్ట్‌ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బ్యాంక్‌ ఇవాళ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. అన్ని అంశాలను మదింపు చేసిన తరవాత సంబంధిత ప్రతాలను త్వరలోనే రెగ్యులేటరీ సంస్థలకు దాఖలు చేస్తామని అన్నారు. ఇప్పటి వరకు నాలుగు మ్యూచువల్ ఫండ్‌ కంపెనీలు ప్రైమరీ మార్కెట్‌కు వచ్చాయి. హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, నిప్పాన్‌ లైఫ్‌ ఇండియా ఏఎంసీ, యూటీఐ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ, ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఏఎంసీ తరవాత కెనరా రొబెకొ ఏఎంసీ ప్రైమరీ మార్కెట్‌కు రానుంది.