17700పైన నిఫ్టి
ఆర్బీఐ క్రెడిట్ పాలసీ తరవాత నిఫ్టీ కాస్త డల్‌గా ఉన్నా… యూరప్ మార్కెట్ నుంచి గట్టి మద్దతు లభించింది. నిన్న విదేశీ ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాల జరుపడం… అంతర్జాతీయ మార్కెట్లు నిస్తేజంగా ఉన్నా… నిఫ్టి స్థిరంగా ప్రారంభమైంది. 75 పాయింట్లు పెరిగిన నిఫ్టి వెంటనే నష్టాల్లోకి వెళ్ళింది. ఇలా మూడు సార్లు నష్టాల్లోకి వెళ్ళిన నిఫ్టి… యూరప్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సూచీలన్నీ ఒకటిన్నర శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో నిఫ్టి 17750ని తాకి ఇపుడు 17729 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టి బ్యాంక్, నిఫ్టి స్వల్ప లాభాలకు పరిమితం కాగా నిఫ్టి మిడ్ క్యాప్ సూచీ దాదాపు ఒక శాతం లాభంతో ఉండగా, నిఫ్టి నెక్ట్స్ 1.55 శాతం లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టి నెక్ట్స్‌లో చోళ ఫైనాన్స్, అదానీ గ్రీన్, గోద్రెజ్ కన్జూమర్ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. అమెరికా ఫ్యూచర్స్ కూడా గ్రీన్‌లో ఉండటంతో నిఫ్టి గ్రీన్‌లో ముగిసే అవకాశాలు కన్పిస్తున్నాయి.