17,500పైన నిఫ్టి
అమెరికా మార్కెట్లకు అనుగుణంగా మన మార్కెట్లు స్పందిస్తున్నాయి. నిఫ్టి ఓపెనింగ్‌లోనే 17500ను దాటి 17534ని తాకింది. ప్రస్తుతం 159 పాయింట్ల లాభంతో 17498 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టి 46 షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. ఐటీ షేర్లు మళ్ళీ టాప్ గెయినర్స్‌గా మారాయి. నిన్న నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించిన షేర్లన్నీ ఇవాళ నష్టాల్లో ఉన్నాయి. చిత్రమేమిటంటే… నిఫ్టిలో ఉన్న బలం ఇతర సూచీల్లో లేకపోవడం. మిడ్ క్యాప్ సూచీ కూడా కేవలం 0.5 శాతం లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టి ఒక్కటే నిఫ్టి స్థాయిలో లాభాల్లో ఉంది. నిఫ్టి నెక్ట్స్‌లో అదానీ గ్రీన్ టాప్ గెయినర్‌గా ఉంది. బడ్జెట్‌కు ముందు నిఫ్టి కూల్ అవుతుందేమో చూడాలి. కేవలం ఐటీ షేర్లు సూచీని ఎంత వరకు తీసుకెళతాయో చూడాలి. ముఖ్యంగా ఇతర రంగాలకు బడ్జెట్ నుంచి మద్దతు మార్కెట్‌కు చాలా కీలకం కానుంది.