For Money

Business News

16900 దాటిన నిఫ్టి

యూఎస్‌ ఫెడ్‌ నిర్ణయం తరవాత మన మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఆసియా మార్కెట్లు ఒక మోస్తరు లాభాలకు పరిమితం కాగా, కాస్సేపటి క్రితం ప్రారంభమైన యూరో మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. కొన్ని పెరగ్గా… మరికొన్ని నష్టాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిఫ్టి 16900 స్థాయిని దాటింది. 16924 స్థాయిని దాటాక ఇపుడు 16909 వద్ద ట్రేడవుతోంది. ఇవాళ్టి కనిష్ఠ స్థాయితో పోలిస్తే నిఫ్టి 200పాయింట్ల దాకా పెరిగింది. క్రితం ముగింపుతో పోలిస్తే 267 పాయింట్ల లాభంతో నిఫ్టి బలంగా ఉంది. నిఫ్టిలో 38 షేర్లు లాభాల్లో ఉండగా… బజాజ్‌ ట్విన్స్‌ దుమ్మురేపుతున్నాయి. బజాజ్‌ ఫైనాన్స్‌ ఫైనాన్స్‌ పది శాతం లాభపడగా, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ 9 శాతంపైనే లాభపడింది. టాటా స్టీల్‌ 5 శాతం, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌ 3 శాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. కొద్దిసేపటి క్రితం శ్రీ సిమెంట్‌ ఫలితాలు ప్రకటించింది. చాలా నిరుత్సాహకరంగా ఉండటంత ఈ కంపెనీ షేర్‌ దాదాపు నాలుగు శాతం క్షీణించింది. జొమాటో 5 శాతం దాకా పెరిగింది.