NFT మార్కెట్లో హ్యాకింగ్ సంచలనం!
ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్ఎఫ్‌టీ (నాన్ ఫంగిబుల్ టోకెన్) మార్కెట్ అయిన ‘ఓపెన్ సి’ హ్యాక్‌కు గురి అయ్యింది. ఓపెన్‌సీపై ఫిషింగ్ అటాక్ జరగడం వల్ల.. కనీసం 32 మంది యూజర్లు 17 లక్షల డాలర్లు (సుమారు రూ.12.6 కోట్లు) విలువైన ఎన్ఎఫ్‌టీలను కోల్పోయినట్టు ఓపెన్‌సీ కో ఫౌండర్ & సీఈఓ డెవిన్ ఫిన్జర్ ప్రకటించారు. ఇప్పటివరకు 32 మంది వినియోగదారులు ఎన్ఎఫ్‌టీలను కోల్పోయినట్లు ధృవీకరించారు. వారు కోల్పోయిన విలువ 20 కోట్ల డాలర్లు అనేది అబద్ధమని అన్నారు. హ్యాకర్లు తాము దొంగిలించిన ఎన్ఎఫ్‌టీలలో కొన్నింటిని విక్రయించి 1.7 మిలియన్ డాలర్లను ఇథీరియం రూపంలోకి మార్చుకున్నట్లు తెలిపారు. బ్లాక్ చైన్ పరిశోధకుడు పెక్ షీల్డ్ మాట్లాడుతూ.. ఫిషింగ్ దాడి గురైన వినియోగదారుని సమాచారం(ఇమెయిల్ ఐడీలతో సహా) లీక్ అయ్యే అవకాశం ఉందని అనుమానిస్తున్నట్లు తెలిపారు.