డెరివేటివ్స్: సెబీ కీలక నిర్ణయం
ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే డెరివేటివ్స్ విభాగంపై ఇటీవల సెబీ దృష్టి సారించింది. సాధారణ ఇన్వెస్టర్లు ఈ విభాగంలో బాగా నష్టపోతున్నారని భావించిన… ఈ స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ… ఇన్వెస్టర్లకు సంబంధించి పలు ప్రతిపాదనలు చేసింది. మరోవైపు డెరివేటివ్స్ విభాగంలో ఒక షేర్ ప్రవేశించేందుకు, బయటకు వచ్చేందుకు సంబంధించిన నిబంధనలు సెబీ మార్చింది. ఈ మేరకు నిబంధనలను విడుదల చేసింది. ముఖ్యంగా డెరివేటివ్స్ విభాగంలో షేర్లను రోలింగ్ పద్ధతిలో అర్హతను నిర్ణయిస్తున్నట్లు వెల్లడించింది. అలాగే ఆరు నెలల పాటు అర్హతకు సంబంధించిన ప్రమాణాలను సదరు షేర్ పాటించి ఉండాలని పేర్కొంది.